
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో వాగ్వాదం జరిగింది. పలువురు చిన్న నిర్మాతలు సి. కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. నిర్మాతల మండలికి ఎన్నికలు జరిపించాల్సి ఉన్నప్పటికీ ఇంకా ఎందుకు ఎన్నికలు జరిపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సమయంలో ఓ నిర్మాత ఈ తతంగమంతా వీడియో చిత్రీకరిస్తుంటే నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేసాడు.
దాంతో మరింత పెద్దదయ్యింది వాగ్వాదం. గత రెండు వారాలుగా చిన్న నిర్మాతలు ఫిలిం ఛాంబర్ ముందు రిలే నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నిర్మాతల మండలికి ఎన్నికలు జరిపించాలని అలాగే చిన్న నిర్మాతల సమస్యలను పరిష్కరించాలని. అయితే చిన్న నిర్మాతలు ఎన్ని డిమాండ్స్ చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు.