34.7 C
India
Friday, April 10, 2026
More

    తారక్ పార్టీ అందుకేనా..!

    Date:

    That's why Tarak's party
    That’s why Tarak’s party

    జూనియర్ ఎన్టీఆర్ తన ఇంట్లో ఇచ్చిన గ్రాండ్ పార్టీకి సినీ ప్రముఖులు కదిలివ చ్చారు. ఈ డిన్నర్ నైట్ కి అగ్ర దర్శకులు రాజమౌళి , త్రివిక్రమ్, కొరటాల శివ, నిర్మాతలు శోభు యార్లగడ్డ, మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలతో పాటు అమెజాన్‌ స్టూడియోస్‌ ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జేమ్స్‌ ఫెర్రెల్‌ హాజరు కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. సడెన్ గా తారక్ పార్టీ ని ఏర్పాటు చేయడంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. శ్రేయోభిలాషులు, సన్నిహితులతో గడిపిన ఈ క్షణాలు అద్భుతం అంటూ ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా కొన్ని ఫోటోలు పంచుకోగా… వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ త్వరలో మరో సెన్సేషన్ కు గేట్లు తెరిచినట్లు పార్టీ చూస్తే అర్థమవుతోంది.

    ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ఎన్టీఆర్‌కు గ్లోబల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. పైగా విదేశాల్లో కూడా ఫ్యాన్‌ బేస్‌ పెరిగింది. కొమురం భీమ్‌ పాత్రలో తారక్ నటనకు ఎంతో మంది ఫిదా అయ్యారు. తాజా అమెజాన్‌ స్టూడియోస్‌ ఇంటర్నేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జేమ్స్‌ ఫెర్రెల్‌ తారక్‌ను కలవడం కోసమే అమెరికా నుంచి ఆయన వచ్చారని టాక్‌ వినిపిస్తోంది. అయితే పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్‌ జేమ్స్‌ అని పోస్ట్‌ పెట్టాడు తారక్. అయితే తారక్‌ను జేమ్స్‌ ఫెర్రెల్‌ కలవడం అన్నది ఇప్పుడు చర్చనీయాశమైంది. ప్రస్తుతం తారక్‌ నటిస్తున్న ఎన్టీఆర్‌ 30 ఓటీటీ స్ర్టీమింగ్‌ అమెజాన్‌ తీసుకుందా? అన్న చర్చ మొదలైంది.

    అంతే కాదు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా హాలీవుడ్‌లో కూడా నటించాలనుందనే కోరికను భయటపెట్టారు తారక్‌. అందులో భాగంగానే జేమ్స్‌ తారక్‌ను కలిశాడా? అమెజాన్‌ ఇంటర్నేషనల్‌ స్టూడియోస్‌ తారక్‌తో సినిమా ప్లాన్‌ చేయనుందా? అన్న చర్చ మొదలైంది. తారక్‌ సన్నిహితుల మాత్రం పార్టీకి ఈ సినిమాకు ఏ సంబంధం లేదని చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. త్వరలో గోవా షెడ్యూల్‌ ప్రారంభించడానికి యూనిట్‌ సిద్ధమవుతోంది. ఈ నెల 19న ఎన్టీఆర్‌ గోవా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే… గ్రాండ్ గా జరిగిన ఈ పార్టీలో పలువులు మిస్ అయ్యారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ . ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామీలీ ట్రిప్ లో ఉండటంతో పార్టీకి రాలేకపోయారు. ఇటు దిల్ రాజు… సుకుమార్ కూడా పార్టీకి హాజరు కాలేదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    Balayya : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?

    Balayya : తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సక్సెస్‌ఫుల్...

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి...