మెగా పవర్ స్టార్ రాంచరణ్ సెల్ఫీ కోసం ఓ చిన్నారి కన్నీళ్ల పర్యంతమయ్యింది. అయితే ఈ విషయం గమనించి చలించిపోయాడు చరణ్.కార్యక్రమం ముగించుకొని వెళ్లి పోతున్న వాడల్లా …… పాపకోసం వెనక్కి వచ్చి మరీ ఆ పాపతో సెల్ఫీ తీసుకున్నాడు. పాపను దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈ అరుదైన సంఘటన న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ దగ్గర జరిగింది.
ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు అనే పాట ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. మార్చి 12 న ఆ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనుంది. అందుకోసం 20 రోజుల ముందుగానే వచ్చాడు చరణ్. అమెరికాలో అడుగుపెట్టిన చరణ్ క్షణం తీరిక లేకుండా వరుస కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నాడు. అందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన Good Morning America కు లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. చరణ్ వస్తున్న విషయం తెలియడంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వాళ్ళందరితో కలిసి లోపలకు వెళ్ళాడు. లైవ్ కార్యక్రమం ముగిసిన తర్వాత బయటకు వచ్చాడు.
ఇంకేముంది బయట ఉన్న ప్రజలు , అభిమానులు చరణ్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి , సెల్ఫీ లు దిగడానికి పోటీ పడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది అదుపు చేస్తుండటంతో కొంతమంది మహిళలు, చిన్నారులు చరణ్ ను కలుసుకోవడం కష్టమైంది. ఇదే సమయంలో ఓ చిన్నారి చరణ్ ను చూసేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో కన్నీళ్ల పర్యంతమయ్యింది. చిన్నారి ఏడుస్తుండటంతో కారు దగ్గరకు వెళ్లిన చరణ్ ఆ పాప ఏడ్పు చూసి చలించిపోయాడు. వెళ్తున్న వాడల్లా పాప దగ్గరకు వచ్చి సెల్ఫీ ఇచ్చాడు . దాంతో ఆ పాప ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లలంటే చరణ్ కు అమితమైన ప్రేమ. అది ఇలాంటి సంఘటనల వల్ల మరోసారి పునరావృతమైంది. పాప కోసం చరణ్ వెనక్కి తిరిగి రావడంతో అక్కడున్న వాళ్లంతా చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ సంఘటన మెగా అభిమానులను చాలా చాలా సంతోషంలో ముంచెత్తడం ఖాయం.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్.