39 C
India
Sunday, April 27, 2025
More

    నా కెరీర్ లోనే ఛాలెంజింగ్ పాత్ర ‘మట్టి కుస్తీ’లో చేశా: హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇంటర్వ్యూ

    Date:

    The most challenging role in my career was in 'Matti Kusti': Heroine Aishwarya Lakshmi Interview
    The most challenging role in my career was in ‘Matti Kusti’: Heroine Aishwarya Lakshmi Interview

    హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయికగా నటిస్తోంది. ‘ఆర్ టీ టీమ్వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో కథానాయిక ఐశ్వర్య లక్ష్మి విలేఖరుల సమావేశంలో ‘మట్టి కుస్తీ’ విశేషాలని పంచుకున్నారు.

    ‘మట్టి కుస్తీ’ కథని ఎప్పుడు విన్నారు ?
    మూడేళ్ళ క్రితం కోవిడ్ కి ముందే ‘మట్టి కుస్తీ’ కథ విన్నాను. నాకు చాలా నచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర చాలా సవాల్ తో కూడుకున్నది. ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. ఇదే విషయం దర్శకుడికి చెప్పా. తర్వాత కోవిడ్ వచ్చింది. మూడేళ్ళ తర్వాత స్క్రిప్ట్ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఈ గ్యాప్ లో కొన్ని సినిమాలు చేయడం వలన కాన్ఫిడెన్స్ వచ్చింది. దీంతో ‘మట్టి కుస్తీ’ ని చేయాలని నిర్ణయించుకున్నా.

    ‘మట్టి కుస్తీ’ లో అంత సవాల్ గా అనిపించిన అంశాలేంటి?
    పాత్ర చాలా ఫిజికల్ వర్క్ ని డిమాండ్ చేస్తుంది. దానికి చాలా ఫిజికల్ ప్రిపరేషన్ కావాలి. ట్రైలర్ లో స్టంట్స్ చూసే వుంటారు. ఎమోషనల్ సీన్స్ ని చేయడం నాకు ఇష్టమే. కామెడీ అనేది నా వరకూ చాలా కష్టం. మొదటి సారి ఇందులో కామెడీని ప్రయత్నించా. ఇదివరకు నేను చేసిన పాత్రల్లో కామెడీ లేదు. ‘మట్టి కుస్తీ’ నాకు ఓ సవాల్. ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో తెలీదు. దర్శకుడు నా ఫెర్ ఫార్మెన్స్ పట్ల చాలా ఆనందంగా వున్నారు. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది.

    ‘మట్టి కుస్తీ’ ఎలా ఉండబోతోంది?
    ‘మట్టి కుస్తీ’ ఫ్యామిలీ డ్రామా. ఇది భార్యభర్తల కుస్తీ(నవ్వుతూ) కుస్తీ, ఇగో, వినోదం అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ప్రతి ఒక్కరూ ‘మట్టి కుస్తీ’ కి కనెక్ట్ అవుతారు. ఇంత చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం వున్న చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదు. ఆడ మగ సమానమే అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించాం. పైసా వసూల్ మూవీ ‘మట్టి కుస్తీ’.

    విష్ణు విశాల్ తో పని చేయడం ఎలా అనిపించింది?
    విష్ణు విశాల్ స్ఫూర్తినిచ్చే వ్యక్తి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ది బెస్ట్ కోసం ప్రయత్నిస్తుంటారు. ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుండి ఆయన సరిగ్గా నిద్రకూడా పోలేదు. విష్ణు విశాల్ కి కథల ఎంపికలో మంచి అభిరుచి వుంది. ఆయన లాంటి విజన్ చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటుంది. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రయాణం అద్భుతం.
    ఆయనతో పని చేయడం చాలా అనందం గా వుంది.

    తెలుగు ప్రేక్షకులు గురించి మీ అభిప్రాయం ?
    తెలుగు ప్రేక్షకులు సినిమాని గొప్పగా ప్రేమిస్తారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా ఎదిగింది. టాలీవుడ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది. తెలుగు నుండి వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కు గొప్ప ఆదరణ వస్తోంది. చాలా పరిశ్రమలు తెలుగు ఇండస్ట్రీని ఫాలో అవ్వడం గమనించాను. తెలుగు ప్రేక్షలులకు సినిమా పట్ల వున్న అభిమానం, ప్రేమే దీనికి కారణం.

    తెలుగు సినిమాలు చూస్తారా? మీ అభిమాన నటులు ఎవరు ?
    తెలుగు సినిమాలు చూస్తాను. అందరూ ఇష్టమే. నటీనటులందరూ ప్రేక్షకులకు వినోదం పంచడానికి కృషి చేస్తారు. ప్రేక్షకులు ఇష్టపడే సినిమాలు చేస్తారు. సాయి పల్లవి, సత్యదేవ్ లతో పరిచయం వుంది.

    రవితేజ గారు ఈ సినిమాకి ఒక నిర్మాత.. ఆయన్ని కలిశారా ?
    రవితేజ గారు షూటింగ్ కి రాలేదు. విష్ణు విశాల్ ని పూర్తిగా నమ్మి, కావాల్సింది సమకూర్చి ఫైనల్ ప్రోడక్ట్ ని మాత్రమే చూపించమన్నారు. ఫైనల్ అవుట్ పుట్ ని చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రవితేజ గారిని కలిశాను.

    ఎలాంటి సినిమాలు ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడతారు ?
    తమిళ్, తెలుగు, మలయాళీ ప్రేక్షకుల అభిమానం లభించింది. సినిమాల ఎంపికలో నాకు ఎలాంటి తొందరలేదు. మంచి కథ, గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలనేది నా ప్రయత్నం.

    ఆల్ ది బెస్ట్
    థాంక్స్.

    Share post:

    More like this
    Related

    MLAs clash : నడి రోడ్డుపై కూటమి ఎమ్మెల్యేల కొట్లాట.. వైరల్ వీడియో

    MLAs clash : అధికార కూటమిలోని ఇద్దరు కీలక నేతలు, భీమిలి ఎమ్మెల్యే...

    Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్: 30 మందికి పైగా మావోయిస్టులు మృతి?

    Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది....

    Six pack : మొదటి సిక్స్ ప్యాక్‌ ఎవరిది?.. హీరోల మధ్య వివాదం

    Six pack : తొలి సిక్స్ ప్యాక్ ఎవరిదన్న విషయంపై తమిళనాట...

    IPL: ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని గెలవాలి?

    IPL 2025లో సాధారణంగా ఏవైనా జట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 8...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MLAs clash : నడి రోడ్డుపై కూటమి ఎమ్మెల్యేల కొట్లాట.. వైరల్ వీడియో

    MLAs clash : అధికార కూటమిలోని ఇద్దరు కీలక నేతలు, భీమిలి ఎమ్మెల్యే...

    Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్: 30 మందికి పైగా మావోయిస్టులు మృతి?

    Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది....

    Six pack : మొదటి సిక్స్ ప్యాక్‌ ఎవరిది?.. హీరోల మధ్య వివాదం

    Six pack : తొలి సిక్స్ ప్యాక్ ఎవరిదన్న విషయంపై తమిళనాట...

    IPL: ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని గెలవాలి?

    IPL 2025లో సాధారణంగా ఏవైనా జట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 8...