తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న అంటే రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ చేయాలని అంతా సిద్ధం చేశారు. కట్ చేస్తే రేపటి నుంచి జరగాల్సిన రెగ్యులర్ షూటింగ్ ఒక వారం వాయిదా పడింది. ఇంతకీ వినోదయా సీతం రిమేక్ వాయిదా పడటానికి కారణం ఏంటో తెలుసా…….
పవన్ కళ్యాణ్ కారకుడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చబ్బీ చీక్స్ అన్నట్లుగా బూరెల బుగ్గలతో ఉన్నాడు. కాస్త లావయ్యాడు కూడా. కానీ ఈ సినిమా కోసం లావు తగ్గాలని పవన్ కళ్యాణ్ భావించాడు. దాంతో డైట్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆ జాగ్రత్తలలో భాగంగానే ఫిబ్రవరి మూడో వారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మొదటిసారిగా మామా – అల్లుళ్లు అయిన పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. ఇది మెగా అభిమానులకు సంతోషకరమైన వార్త అనే చెప్పాలి.