అమెరికాలో ఉన్నత విద్య కోసం అలాగే ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే ఇండియన్స్ కు శుభవార్త. అమెరికా వీసాలు అంత సులువు కాదు కానీ కొన్ని సులభమైన మార్గాల ద్వారా అమెరికా వీసాలను పొందొచ్చు. అమెరికా వీసాల కోసం ఉన్న ఫలంగా దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురవ్వడం ఖాయం. అంతేకాదు సరైన వివరాలు లేకుండా , సదరు యూనివర్సిటీ ల ఆమోద పత్రాలు లేకుండా దరఖాస్తు చేసుకోవడం ద్వారా రిజెక్ట్ అవ్వడం ఖాయం. అందుకే ముందు జాగ్రత్తగా పలు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అవలీలగా వీసాలు పొందవచ్చు. ఆ మార్గాలు ఏంటో ఒకేసారి చూద్దాం.
యూనివర్సిటీ నుండి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత పాస్ పోర్ట్ , ఐడీ ప్రూఫ్ , ఫోటో తో పాటుగా దరఖాస్తు రుసుము తదితర వివరాలతో F 1- విద్యార్ధి వీసా కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
వీలైనంత ముందుగా కనీసం ఏడాది ముందుగా విదేశీ విద్యను ప్లాన్ చేసుకోవాలి.
వీసా కోసం కనీసం 3 నెలల ముందే అప్లయ్ చేసుకోవాలి.
ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి వీసాను ముందుగానే పొంది ఉండటం మంచి.
ముందుగానే ప్లాన్ చేసుకుంటే విమాన టికెట్ చార్జీ కూడా తక్కువకు పొందొచ్చు.
Breaking News