Tollywood divorced Couples :
తెలుగు సినిమా పరిశ్రమలో జంటలు ఎంత వేగంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారో అంత తేలిగ్గా విడాకులు తీసుకుంటున్నారు. దీంతో వారి కాపురం మూన్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. ఎంతో కాలంగా చాలా మంది తమ జీవిత భాగస్వాములతో పడలేక విడిపోతున్నారు. వివాహం మూడు నాళ్ల ముచ్చటగానే అయిపోతోంది. దీంతో వారి కాపురాలు కల్లోలం కావడానికి కారణాలేంటో చూద్దాం.
మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ కుమార్. తన మొదటి భార్య ప్రణతిరెడ్డికి విడాకులు ఇచ్చి మౌనికను రెండో పెళ్లి చేసుకున్నాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కు 2014లో ప్రేమ వివాహం జరిగింది. కనిక దిల్లాస్ అనే రచయిత్రిని పెళ్లి చేసుకున్నా మనస్పర్దలు రావడంతో పరస్పరం విడిపోయారు. ఇద్దరి అంగీకారంతోనే విడిపోయినా వారి కాపురం కూడా మూడునాళ్ల ముచ్చటే అయింది.
సుమంత్, కీర్తిరెడ్డిల వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. రెండేళ్లు కూడా కాకుండానే విడాకులు తీసుకున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కీర్తిరెడ్డిని వదిలేసి సుమంత్ మరో పెళ్లి చేసుకోవడం విశేషం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తన భార్య రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చి మూడో వివాహం చేసుకున్నారు. మొదటి భార్య నందినికి డైవర్స్ ఇచ్చిన విషయం తెలుసు.
అక్కినేని నాగార్జున 1984లో వెంకటేష్ చెల్లెను పెళ్లి చేసుకుని 1990లో విడాకులు ఇచ్చి అమలను చేసుకున్నారు. యాంకర్ ఝాన్సీ ప్రముఖ నటుడు జోగినాయుడును వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తనకంటే చిన్న వయసు ఉన్న వాడితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. దివంగత నటుడు శరత్ బాబు రమాప్రభ 1981లో పెళ్లి చేసుకుని 1988లో విడాకులు తీసుకున్నారు.
రాధిక ఇంతవరకు మూడు సార్లు వివాహం చేసుకుంది. మొదటిసారి 1985లో దర్శకుడు ప్రతాప్ పోథన్ ను చేసుకుంది. తరువాత రిచర్డ్ హార్డీని వివాహమాడింది. ప్రస్తుతం శరత్ కుమార్ ను చేసుకుంది. కమల్ హాసన్ 1978లో నర్తకి వాణి గణపతిని వివాహం చేసుకున్నాడు. 1988లో నటి సారికను పెళ్లి చేసుకున్నాడు. శృతిహాసన్ వీరి కూతురే.