
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు మహేష్ బాబు – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో అతడు , ఖలేజా చిత్రాలు వచ్చాయి. అతడు యావరేజ్ కాగా ఖలేజా ప్లాప్ అయ్యింది. దాంతో ఈసారి తప్పకుండా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసిగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే ఈ సినిమాకు ”అయోధ్యలో అర్జునుడు ”, లేదంటే ” అతడే ఒక సైన్యం ” అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారట దర్శకులు త్రివిక్రమ్. ఎక్కువగా అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ పట్ల మక్కువ చూపిస్తున్నారట మేకర్స్. త్రివిక్రమ్ సినిమాలు ఎక్కువగా ” అ ” అక్షరంతోనే మొదలు అవుతాయి. ఆ సెంటిమెంట్ తో ఈ సినిమాకు కూడా అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట.
మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుండగా మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం పై మహేష్ బాబు అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే మహేష్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. ఈ సినిమా రికార్డుల మోత మోగించాలని ఆశ పడుతున్నారు.