33.7 C
India
Thursday, June 13, 2024
More

  2022 డిజాస్టర్ మూవీస్

  Date:

  tollywood disaster movies 2022
  tollywood disaster movies 2022

  2022 లో డిజాస్టర్ మూవీస్ టాలీవుడ్ ను భారీ నష్టాలలో ముంచేసాయి. భారీ అంచనాల మధ్య , భారీ స్టార్ కాస్టింగ్ తో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో ఆ సినిమాలను నిర్మించిన నిర్మాతలకు అలాగే కొన్న బయ్యర్లను కూడా దారుణంగా ముంచేసాయి. అలా టాలీవుడ్ లో నష్టాలను చవిచూసిన డిజాస్టర్ మూవీస్ లిస్ట్ ఒకసారి చూద్దామా !

  1) రాధేశ్యామ్ : డార్లింగ్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం ” రాధేశ్యామ్ ”. యువి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది. బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల వసూళ్లను సాధించింది. అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో పాటుగా భారీ బడ్జెట్ కారణంగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. నిర్మాతతో పాటుగా బయ్యర్లను కూడా ముంచేసింది.

  2) ఆచార్య : మెగాస్టార్ చిరంజీవి , రాంచరణ్ ఇద్దరు కూడా నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘోర పరాజయం పొందింది. కనీసం 70 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దాంతో నిర్మాతతో పాటుగా బయ్యర్లు కూడా ఘోరంగా నష్టపోయారు.

  3) విరాట పర్వం : సాయి పల్లవి – రానా జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యధార్థ గాధగా తెరకెక్కింది. అయితే కమర్షియల్ హంగులు లేకపోవడంతో సినిమాకు మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ ఘోరంగా దెబ్బతింది. బయ్యర్లతో పాటుగా నిర్మాత కూడా నష్టపోయాడు.

  4) లైగర్ : విజయ్ దేవరకొండ – అనన్య పాండే జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ” లైగర్ ”. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. నిర్మాతలతో పాటుగా బయ్యర్లు కూడా ఘోరంగా నష్టపోయారు. తక్కువ బడ్జెట్ లో చేయాల్సిన ఈ సినిమాను పాన్ ఇండియా మోజులో భారీగా ఖర్చుపెట్టారు. వృధా ఖర్చు ఎక్కువగా పెట్టి హంగామా సృష్టించారు. సరైన కథ , కథనం లేకపోవడంతో ప్రేక్షకులు దారుణంగా తిప్పికొట్టారు.

  5) ది ఘోస్ట్ : కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. దాంతో దారుణ పరాజయం చవిచూసింది.

  వీటితో పాటుగా పలు చిత్రాలు రామారావు ఆన్ డ్యూటీ , గని , ది వారియర్ , మాచర్ల నియోజకవర్గం తదితర చిత్రాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి.

  Share post:

  More like this
  Related

  Bhadrachalam : రామయ్య హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు

  Bhadrachalam : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని...

  Actor Prithviraj : నటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాక్.. నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ

  Actor Prithviraj : ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటూ ‘ఖడ్గం’లో...

  104 Employee Protest : అరగుండు, అరమీసంతో.. 104 ఉద్యోగి నిరసన

  104 Employee Protest : ఓ అధికారి అవినీతిని బహిర్గతం చేసినందుకు...

  INDIA Vs USA : యూఎస్ఏపై ఇండియా సూపర్ విక్టరీ

  INDIA Vs USA : టీ 20 వరల్డ్ కప్ లో...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Kalki 2898 AD : కల్కిలో మరో టాలీవుడ్ స్టార్?

  Kalki 2898 AD : ప్రభాస్  అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో...

  Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

  Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

  Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

  Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

  Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

  Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...