టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు విద్యాసాగర్ అనారోగ్యంతో మృతి చెందారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విద్యాసాగర్ సినిమాలకు దూరమయ్యారు. హీరోగా , విలన్ గా పలు చిత్రాల్లో నటించిన విద్యాసాగర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. అయితే పక్షవాతం సోకడంతో చాలాకాలంగా వీల్ చేయిర్ కు , మంచానికి మాత్రమే పరిమితం అయ్యారు. ఇక ఈరోజు ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దాంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది.
Breaking News