
స్టార్ హీరోయిన్ సమంత పై దారుణమైన కామెంట్స్ చేసాడు నిర్మాత , నటుడుత్రిపురనేని చిట్టిబాబు. సమంత అసలు స్టార్ హీరోయిన్ కాదు , తన స్థాయి దిగజార్చుకొని పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది అలాంటి ఆమెను శాకుంతలం చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవడం ఏంటి ? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు సమంతపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నాడు.
యశోద సినిమా అప్పుడు కూడా పలు డ్రామాలు ఆడింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సినిమా జనాలకు నచ్చితే చూస్తారు ….. నచ్చలేదు కాబట్టి చూడలేదు. ఇక ఇప్పుడు శాకుంతలం సినిమా గురించి కూడా పెద్ద గొప్పలు పోతోంది. ఏడుస్తోంది ….. అనారోగ్యానికి గురయ్యాను అంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తోందని, ఇలాంటి చీప్ ట్రిక్కుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఏ సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చితే చూస్తారు …. లేదంటే తిప్పి కొడతారు. అయినా శకుంతలగా సమంతను తీసుకోవడమే పెద్ద తప్పు అంటూ దుయ్యబట్టాడు.
త్రిపురనేని చిట్టిబాబు ఇంతగా సమంతను విమర్శించడానికి ప్రధాన కారణం పుష్ప లో ఐటెం సాంగ్ చేయడమే ! ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి ఐటెం సాంగ్ చేసి తన స్థాయిని తగ్గించుకుందని అతడి భావన. ఇక సమంత అభిమానులు ఈ చిట్టిబాబు పై విమర్శలు చేస్తున్నారు. అలాగే కొంతమంది సమంతను విమర్శిస్తున్నారు.






