విడాకులు తీసుకోవడం ఇష్టం లేకే పెళ్లి చేసుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది త్రిష. 39 సంవత్సరాల త్రిష ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఆమధ్య నిర్మాత వరుణ్ మణియన్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది ఈ భామకు. ఇక పెళ్లి కావడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా పెళ్లి ఆగిపోయింది దాంతో వివాహ నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు.
ఇక ఇటీవల ఈ భామ పెళ్లి గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి దాంతో ఇదే విషయాన్ని త్రిష ముందు ఉంచితే ఆగ్రహించింది. నా పెళ్లి ఎప్పుడు ? అంటే అర్ధం ఉంది కానీ ఇంకా త్రిష పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనడంలో అస్సలు అర్ధం లేదు …… మీ ప్రశ్న రాంగ్ అంటూ మండిపడింది.
నా చుట్టాలలో అలాగే ఫ్రెండ్స్ లలో చాలామందిని చూసాను …… పెళ్లి చేసుకొని ఎవరూ సంతోషంగా లేరు …… పిల్లల కోసమో లేక మరో కారణంతోనో కలిసి ఉంటున్నారు కానీ సంతోషంగా మాత్రం లేరు. అలాంటప్పుడు పెళ్లి చేసుకొని గొడవలు పడుతూ తర్వాత విడాకులు తీసుకోవడం ఎందుకు ? నాకు విడాకులు తీసుకోవాలని లేదు అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు. నాకు తగిన వ్యక్తి తారసపడితే అప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అంటోంది త్రిష.