ఇళయ దళపతి విజయ్ సినిమాలోంచి త్రిష తప్పుకుంది…… లేదంటే త్రిష ను విజయ్ సినిమా నుండి తొలగించారు అంటూ వస్తున్న కథనాలను ఖండించింది త్రిష మదర్. ఇటీవలే విజయ్ 67 వ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విజయ్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే టైటిల్ కూడా రివీల్ చేశారు……… లియో అంటూ.
ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష ను ఎంపిక చేశారు. ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంది. ఇక షూటింగ్ కాశ్మీర్ లో ….. అక్కడ ఎప్పుడూ చల్లగానే ఉంటుంది వాతావరణం. ఇక ఈ సమయంలో మరింత మంచు కురుస్తూ ఉంటుంది. దాంతో త్రిష షూటింగ్ కు ఎగ్గొట్టిందని ……. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో వాగ్వాదానికి దిగిందని రకరకాల కథనాలు వైరల్ గా మారాయి. అంతేకాదు ఈ సినిమాలోంచి త్రిష ను తొలగించారని …… త్రిష తప్పుకుందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దాంతో ఈ ఊహాగానాలకు స్వస్తి పలకాలని భావించిన త్రిష మదర్ ఆ వార్తలన్నీ వట్టి పుకార్లు మాత్రమే నని , త్రిష ఆ సినిమా నుండి తప్పుకోలేదని…… ఎలాంటి విభేదాలు లేవని కుండబద్దలు కొట్టింది. ప్రస్తుతం లియో చిత్రం కశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రియా ఆనంద్ కూడా ఒక హీరోయిన్ గా నటిస్తోంది ఈ చిత్రంలో.