దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత స్రవంతి రవికిశోర్ కాళ్ళు మొక్కి అందరినీ షాక్ అయ్యేలా చేసాడు. ఇంతకీ స్రవంతి రవికిశోర్ కాళ్ళు త్రివిక్రమ్ ఎందుకు మొక్కాడో తెలుసా …….. త్రివిక్రమ్ దర్శకుడు కావడానికి కారకుడు ఈ స్రవంతి రవికిశోర్ కాబట్టి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం ” నువ్వే – నువ్వే ”. తరుణ్ హీరోగా నటించగా శ్రియా శరన్ హీరోయిన్ గా నటించింది.
ప్రకాష్ రాజ్ , సునీల్, ఎమ్మెస్ నారాయణ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం నువ్వే – నువ్వే చిత్రం విడుదలయింది. పెద్దగా ఆడలేదు కానీ యావరేజ్ అయ్యింది. ఈ సినిమాలోని పాటలు మాత్రం మంచి హిట్ అయ్యాయి. నువ్వే – నువ్వే సినిమా విడుదలై 20 ఏళ్ళు కావడంతో ఆ చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది.
కాగా ఆ వేడుకలో దర్శకులు త్రివిక్రమ్ నిర్మాత స్రవంతి రవికిశోర్ కాళ్ళు మొక్కాడు. ఈరోజు త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయ్యాడంటే ఆరోజు రవికిశోర్ ఛాన్స్ ఇవ్వబట్టే కదా ! అందుకే కృతజ్ఞతగా పాదాభివందనం చేసాడు త్రివిక్రమ్. ఈ సంఘటన ఆహుతులను విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో తరుణ్ , శ్రియా శరన్ , ప్రకాష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు హీరోగా భారీ చిత్రం చేయనున్నాడు.