బాలయ్య , చిరంజీవి లకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బాలయ్య , చిరంజీవి లకు కేసీఆర్ స్పెషల్ పర్మిషన్ ఇవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఈనెల 12 న బాలయ్య వీర సింహా రెడ్డి విడుదల అవుతుండగా జనవరి 13 న చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విడుదల అవుతున్నాయి. ఆ చిత్రాలకు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 6 షోలకు అనుమతి ఇచ్చింది. మాములుగా అయితే ప్రతీ రోజు 4 ఆటలకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ అగ్ర హీరోల చిత్రాలకు మాత్రం అభిమానుల తాకిడి ఉంటుంది కాబట్టి స్పెషల్ పర్మిషన్ తీసుకుంటారు ఆయా చిత్రాల నిర్మాతలు.
అందులో భాగంగానే వీర సింహా రెడ్డి , వాల్తేరు వీరయ్య చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ తెలంగాణ ప్రభుత్వంకు వినతి పత్రం ఇవ్వగా వెంటనే విడుదల రోజున 6 షోలకు అనుమతి ఇచ్చింది. దాంతో జనవరి12 న విడుదల అవుతున్న వీర సింహా రెడ్డి తెలంగాణలో 6 షోలు వేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే జనవరి 13 న విడుదలయ్యే వాల్తేరు వీరయ్య కూడా 6 షోలకు పర్మిషన్ ఇచ్చారు. దాంతో భారీ ఓపెనింగ్స్ లభించడం ఖాయం.