
పేద కళాకారులను JSW & Jaiswaraajya యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేయడం నాకు నచ్చిందని, అలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు కృతజ్ఞతలు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. భీమవరం బుల్లోడు గా చిత్ర పరిశ్రమలో పేరు గాంచిన తుమ్మలపల్లి ఇప్పటి వరకు 100 కు పైగా చిత్రాలను నిర్మించి సంచలనం సృష్టించారు.
ఆ సందర్బంగా JSW & Jaiswaraajya యూట్యూబ్ ఛానల్స్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి లతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. గాడ్ ఫాదర్ సాధిస్తున్న సంచలన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఆదిపురుష్ టీజర్ పై తీవ్ర స్థాయిలో వస్తున్న విమర్శలపై కూడా స్పందించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ పూర్తి ఇంటర్వ్యూ త్వరలోనే JSW & Jaiswaraajya యూట్యూబ్ ఛానల్స్ లో ప్రసారం కానుంది.
Anchor : Ashok.