15.6 C
India
Sunday, November 16, 2025
More

    ట్విన్స్‌ హీరోలుగా కొత్త సినిమాకు శ్రీ‌కారం!

    Date:

    Twins are the heroes of a new movie
    Twins are the heroes of a new movie

    క‌వ‌ల‌లు హీరోలుగా ఓ కొత్త సినిమా రాబోతోంది. TSR మూవీ మేకర్స్ బ్యానర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా, తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణంలో, ప్రొడక్షన్ నం.1 చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. నిజ జీవితంలోని కవలలు రామ‌కృష్ణ‌, హ‌రికృష్ణ హీరోలుగా న‌టిస్తున్న చిత్ర‌ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు.

    ఈ సంద‌ర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మా కంటూ ఓ స్థానం ఏర్ప‌రుచుకునేందుకు TSR మూవీ మేకర్స్ సంస్థ‌ను ప్రారంభిస్తున్నాం. ఈ సంద‌ర్భంగా ప్రొడక్షన్ నం. 1 చిత్రానికి శ్రీ‌కారం చుడుతున్నాం. మా పిల్లలు రామ‌కృష్ణ‌, హ‌రికృష్ణ ఇద్దరినీ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నాం. ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం మాస్ట‌ర్ మాన్ బద్రీ అన్న సపోర్ట్ ఎంతో ఉంది.

    ముఖ్య అతిథి స్టంట్ మాన్ బ‌ద్రీ మాట్లాడుతూ… హీరోలిద్దరూ గర్వపడేలా ఎద‌గాలి. న‌టుడు అనేవాడు క‌ష్ట‌ప‌డితేనే గొప్పగా ఎదుగుతాడు. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు కొడుకులు న‌టులుగా ఇండ‌స్ట్రీలో త‌మ‌కంటూ ఓ స్థానం సంపాదించుకోవాలి. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు.

    ‘బస్ స్టాప్’ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. చిన్న సినిమాలు రావాలి, చిన్న నిర్మాత‌లు న‌టుల పాలిట దేవుళ్ళు. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఫ్యాషన్‌తో సినిమా తీస్తున్నారు. సూప‌ర్ హిట్ కావాలి. TSR మూవీ మేకర్స్ టీంకు, చిత్ర‌యూనిట్‌కు అభినంద‌న‌లు.

    హీరోలు రామ‌కృష్ణ‌, హ‌రికృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా మేం హీరోలుగా ప‌రిచ‌యం అవుతున్నాం. మీ అంద‌రి స‌పోర్టు కావాలి. మీ ఆశీస్సులు ఉండాలి. చిన్నప్పటి నుంచి నటులం కావాలనే డ్రీమ్ ఉండేది అది ఇప్పుడు నెర‌వేరుతోంది. ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా మేం న‌టిస్తాం. సినిమాను ఆద‌రించాలి.

    ‘మీలో ఒక్క‌డు’ చిత్ర నిర్మాత కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ… TSR మూవీ మేక‌ర్స్ సంస్థ‌ ఏర్పాటు చేయడం సంతోషం. ఈ బ్యాన‌ర్ ద్వారా ఎన్నో సినిమాలు చేయాలి. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, పూర్తి వివరాలు అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌ ప్ర‌క‌టిస్తారు. సినిమా విజ‌యవంతం కావాల‌ని కోరుకుంటున్నాను.

    ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన అతిథుల‌కు TSR మూవీ మేక‌ర్స్ సంస్థ‌కు సంబంధించిన మెమోంటోలు అంద‌జేసి స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మీలో ఒకడు నిర్మాత కుప్పిలి శ్రీనివాసరావు , అశోక్ కుమార్ ,బస్టాప్ కోటేశ్వరరావు ,’ర‌చ్చ’ ర‌వి, టివి 5 వి వెంకటేశ్వర్లు, అరుంధతి శ్రీనివాస్, నటుడు విజయభాస్కర్, గబ్బర్ సింగ్ బ్యాచ్ రమేష్, రింజీమ్ రాజు, కోట కరుణకుమార్, ఇండోప్లెక్స్ ప్రభాకర్ ,బివి శ్రీనివాస్ ,యాదమరాజు , నరేష్ ,రమణ, రేఖ నిరోషా.. త‌దిత‌రులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RX 100 actor : ఆర్ ఎక్స్ 100  యాక్టర్  కుటుంబ సభ్యులంతా సినిమా స్టార్లే… వారెవరో తెలుసా?  

    RX 100 actor : రామ్‌కీ..90 దశాబ్దంలో తమిళంలో స్టార్ హీరో....

    Ramakrishna : రాజ్యాంగం మార్పు.. ఆ మూడు పార్టీల వైఖరి చెప్పాలి : సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

    Ramakrishna : అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత...

    బాలకృష్ణ, రామకృష్ణ పెళ్లికి వెళ్లని ఎన్టీఆర్.. కారణం అదేనా..?

    మహానుభావులు ఏం చేసినా అది ప్రజల కోసమే. తన కుటుంబం గురించి...

    స్టిక్కర్లు కనిపించడం లేదు రామకృష్ణా..!

    నువ్వే మా నమ్మకం జగన్ రెండు వరాల పాటు ఇంటి ఇంటికి...