యు బ్లడ్ యాప్ సర్వరోగ నివారిణి లాంటిదని ప్రశంసల వర్షం కురిపించారు నటులు శివాజీరాజా. హీరోగా , విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , హాస్య నటుడిగా విభిన్న పాత్రలను పోషించిన నటులు శివాజీరాజా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు తల్లో నాలుకలా వ్యవహరించి పలు కీలక పదవులను నిర్వహించారు. మూవీ ఆర్టిస్ట్ లకు విశిష్ట సేవలు అందించారు.
తాజాగా JSW & Jaiswaraajya యూట్యూబ్ ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్తదానం యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించారు. నాకు యాక్సిడెంట్ అయిన సమయంలో రక్తం కోసం మావాళ్ళు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అప్పట్లో రక్తదాతల కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడలా కాదు ఎందుకంటే యు బ్లడ్ యాప్ ని నా మిత్రుడు జై యలమంచిలి ఓ మహా లక్ష్యంతో రూపొందించారు. ప్రతీ ఏటా యాక్సిడెంట్ ల వల్ల కావచ్చు లేదంటే రకరకాల ఆపరేషన్ ల వల్ల కావచ్చు పెద్ద ఎత్తున రక్తం కావాల్సి వస్తోంది.
అలాంటి సమయంలో సరైన రక్తదాతలు లభించకపోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతోంది. దాంతో అలాంటి వాటిని నివారించడానికి జై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. యు బ్లడ్ యాప్ డోన్ లోడ్ చేసుకోవడం వల్ల రక్తదాతల పూర్తి వివరాలు అందులో ఉంటాయి కాబట్టి అవసరం ఉన్నవాళ్లు , లేనివాళ్ళు అని చూడకుండా ప్రతీ ఒక్కరూ ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా సరైన సమయంలో రక్తదాతల వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని …… అదే ఈ యాప్ గొప్పతనమని ప్రశంసలు కురిపించారు.
ప్రోగ్రాం డైరెక్టర్ : అశోక్