
డార్లింగ్ ప్రభాస్ పెళ్లి గతకొంత కాలంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఉమైర్ సంధు అనే రివ్యూ రైటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వచ్చేవారం మాల్దీవులలో ప్రభాస్ – కృతి సనన్ ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నారు అంటూ ట్వీట్ చేసాడు ఉమైర్ సంధు. ఈ ట్వీట్ కాస్త సంచలనంగా మారింది. ఈ ట్వీట్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఉమైర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం నీకు చెప్పారా ? హోటల్ బుక్ చేయమన్నారా ? కనీసం ఈ విషయం వాళ్ళకైనా తెలుసా ? అంటూ అతడిపై మండిపడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. గతకొంత కాలంగా ప్రభాస్ – కృతి సనన్ ల మధ్య కుచ్ కుచ్ హోతాహై అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ మీడియాలో ఈ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
అయితే పెళ్లి వార్తలను ఎప్పటికప్పుడు ప్రభాస్ ఖండిస్తూనే ఉన్నాడు కానీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. అసలు మొదట్లో అనుష్క – ప్రభాస్ ల పెళ్లి గురించి ఎక్కువగా గాసిప్స్ వినబడేవి కానీ ఇప్పుడు అనుష్క స్థానంలో కృతి సనన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రభాస్ – కృతి సనన్ జంటగా ఆదిపురుష్ అనే చిత్రంలో నటించారు. ఇక అప్పటి నుండి ఈ ఇద్దరి ఆమధ్య ఏదో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.






