
లండన్ లో ఉగాది వేడుకలకు రంగం సిద్ధమైంది. United Kingdom Telugu Association ఆధ్వర్యంలో ఈ ఉగాది వేడుకలు జరుగనున్నాయి. మార్చి 25 శనివారం రోజున సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనుంది యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం. ఈ వేడుకలలో పెద్ద ఎత్తున తెలుగువాళ్లు పాల్గొననున్నారు. ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు నిర్వాహకులు.
ఉగాది అనగానే పంచాంగ శ్రవణం అలాగే ఉగాది పచ్చడి సర్వసాధారణం దాంతో వాటిని ప్రత్యేకంగా మలిచే పనిలో పడ్డారు. ఉగాది పచ్చడి విదేశాలలో మరింత రుచికరంగా ఉండనుంది ఎందుకంటే ……. ఇక్కడి వాతావరణంలోని పచ్చడి వేరు ఖండాంతరాలను దాటిన సమయంలో ఆ ఉగాది పచ్చడికి మరింత విశిష్టత చేకూరనుంది. అలాగే పలువురు ప్రముఖులను , సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన వాళ్ళను ఉగాది పురస్కారాలతో సన్మానించనుంది United Kingdom Telugu Association నిర్వాహకులు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విదేశాలలో ఉన్న తెలుగువాళ్లు మరింత ఐక్యంగా బలాన్ని చాటే అవకాశం ఉంటుంది. అందుకే పెద్ద ఎత్తున పాల్గొని తమ అనుబంధాన్ని చాటుకుంటుంటారు.