నటసింహం నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న షో ” అన్ స్టాపబుల్ ”. మొదటి సీజన్ రికార్డుల మోత మోగించింది దాంతో ఇటీవలే రెండో సీజన్ కూడా అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ రెండో సీజన్ ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ లతో ప్రారంభించాడు బాలయ్య. ఈ సోకు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఇక రేపు యంగ్ హీరోలు విశ్వక్ సేన్ , సిద్దు జొన్నలగడ్డ లతో బాలయ్య చేసిన హంగామా ప్రసారం కానుంది. ఇక ముచ్చటగా మూడో ఎపిసోడ్ లో అందమైన భామలు రమ్యకృష్ణ , రాశి ఖన్నా లు రానున్నారట. బాలయ్య అంటేనే సరదా మనిషి దానికి తోడు అందమైన భామలు ఉంటే మరింతగా రెచ్చిపోతాడు. రమ్యకృష్ణ బాలయ్య తో పలు చిత్రాల్లో నటించింది కూడా. దాంతో రమ్యకృష్ణ తో బాలయ్య ఆట పసందుగా సాగడం ఖాయం.