నటసింహం నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ షో ” అన్ స్టాపబుల్ ”. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి గెస్ట్ గా వచ్చాడు. ఇక ఈ రెండో సీజన్ కూడా అట్టహాసంగా ప్రారంభమైంది. బాలయ్య – చంద్రబాబు షో అదిరిపోయింది.
ఇక రెండో సీజన్ లో రెండో ఎపిసోడ్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది ఎందుకో తెలుసా ……. ఈ రెండో ఎపిసోడ్ కు యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ అలాగే విశ్వక్ సేన్ లు గెస్ట్ లుగా హాజరయ్యారు. తాజాగా ఈ ప్రోమో ఆహా టీమ్ విడుదల చేసింది. బాలయ్య ప్రశ్నలు , యంగ్ హీరోల సమాధానాలు మొత్తానికి ఈ రెండో ఎపిసోడ్ మరింత రచ్చ రచ్చ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ ఈ శుక్రవారం ప్రారంభం కానుంది.