నటసింహం నందమూరి బాలకృష్ణ ఆహా కోసం చేస్తున్న షో అన్ స్థాపబుల్ . మొదటి సీజన్ ప్రపంచ వ్యాప్తంగా మోత మోగించింది. ఇండియాలోనే నెంబర్ 1 షోగా చరిత్ర సృష్టించింది. మొదటి షో ఎవరూ ఊహించని విధంగా సక్సెస్ కావడంతో ఇటీవలే రెండో సీజన్ ను ప్రారంభించారు.
రెండో సీజన్ లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ లు సందడి చేశారు. ఈ ఎపిసోడ్ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. ఇక నిన్ననే ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు, ఏ. కోదండరామి రెడ్డి , ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు లతో ఒక స్పెషల్ ఎపిసోడ్ చేసాడు బాలయ్య. కట్ చేస్తే బాలయ్య తదుపరి ఇంటర్వ్యూ ఎవరిదై ఉంటుందా ? అనే ఆసక్తి నెలకొంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య షోకు తదుపరి గెస్ట్ గా డార్లింగ్ ప్రభాస్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అసలు మొదటి సీజన్ లోనే డార్లింగ్ ప్రభాస్ తో బాలయ్య షో ఉండాల్సి ఉండే కానీ కుదరలేదు. కట్ చేస్తే రెండో సీజన్ లో వస్తున్నాడు ప్రభాస్. బాలయ్య షోలో ప్రభాస్ వస్తే ……. ఈ ఎపిసోడ్ మాత్రం బాక్స్ లు బద్ధలవ్వడం ఖాయం. ఎందుకంటే బాలయ్య ప్రశ్నల వర్షం కు డార్లింగ్ ప్రభాస్ సమాధానాలు ఎలా ఇస్తాడు …. అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడటం ఖాయం.