సోషల్ మీడియాలో సునామీ సృష్టించడానికి సిద్ధమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇంతకీ ఈ సునామీ ఏంటి ? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సునామీ సృష్టించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఈరోజు బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ ఆహా కోసం నిర్వహిస్తున్న షో ” అన్ స్టాపబుల్ విత్ NBK ”.
బాలయ్య షో దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిచిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ అద్భుతమైన విజయం సాధించడంతో రెండో సీజన్ ను కూడా స్టార్ట్ చేసారు. ఇక రెండో సీజన్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా బాహుబలి ప్రభాస్ ఎపిసోడ్ అత్యధికంగా వ్యూస్ సాధించి చరిత్ర సృష్టించింది.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే …… ఈ ఇంటర్వ్యూ కూడా రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కానుంది. ఈరోజు మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. రాత్రి 9 గంటలకు ఆహా లో లైవ్ లోకి రానుంది. ఇక పవన్ కళ్యాణ్ కు సహజంగానే అభిమానులు ఎక్కువ దాంతో ఆహా సర్వర్ లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది ఆహా టీమ్. టెక్నికల్ టీమ్ కూడా సిద్ధంగా ఉందట ఏదైనా సమస్య తలెత్తితే దాన్ని వెంటనే పరిష్కరించడానికి. మొత్తానికి బాలయ్య – పవన్ కళ్యాణ్ షో రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది.