26.2 C
India
Friday, July 19, 2024
More

  అన్ స్టాపబుల్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన దిల్ రాజు

  Date:

  Unstoppable motion poster launched by Dil Raju
  Unstoppable motion poster launched by Dil Raju

  పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం, ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్రవేసుకున్న డైమాండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్’. ‘అన్ లిమిటెడ్ ఫన్’ అనేది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, గోవాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లతో ముస్తాబవుతోంది.

  తాజాగా ‘అన్ స్టాపబుల్’ మోషన్ పోస్టర్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. దర్శకుడు డైమండ్ రత్న బాబు, నిర్మాత రజిత్ రావు, చిత్ర యూనిట్ కి బెస్ట్ విశేష్ అందించారు.

  డైమండ్ రత్నబాబు.. మాట్లాడుతూ.. థియేటర్ లో కుటుంబంతో సహా వచ్చి హాయిగా నవ్వుకునే చిత్రమిది. సన్నీ, సప్తగిరి పోటీపడి నటించారు. అత్యున్నత టెక్నిషియన్ లను ఇచ్చినందుకు నిర్మత రజిత్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు.

  చిత్ర నిర్మాత రజిత్ రావు మాట్లాడుతూ.. సినిమాలపై ప్యాషన్ తో సినిమా రంగానికి వచ్చాను. నా మొదటి సినిమాకి తెలుగు ప్రేక్షకులు, మీడియా సపోర్ట్ కావాలి. మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన దిల్ రాజు గారికి కృతజ్ఞతలు’ తెలిపారు.

  బిత్తిరి సత్తి ,షకలక శంకర్, పృద్వీ కీలక పాత్రలు పోహిస్తున్నారు. డిజే టిల్లు మురళి, సూపర్ విమన్ లిరీషా, రాజా రవీంద్ర ,పోసాని కృష్ణ మురళి, చమ్మక్ చంద్ర, విరాజ్ ముత్తంశెట్టి, గీతా సింగ్, రోహిణి, రూప లక్ష్మీ, మణి చందన, విక్రమ్ ఆదిత్య, రఘుబాబు, ఆనంద్ చక్రపాణ, గబ్బర్ సింగ్ బ్యాచ్ ప్రధాన తారాగణంగా ‘అన్ స్టాపబుల్’ చిత్రాన్ని నవ్వులు పూయించ డానికి చిత్ర యూనిట్ సిద్ధం చేస్తున్నారు.

  ఈ చిత్రానికి కో ప్రోడ్యుసర్లుగా షేక్ రఫీ, బిట్టు ( నర్సయ్య న్యవనంది ), రాము వురుగొండ వ్యవహరిస్తున్నారు. డీఓపీ గా వేణు మురళీధర్, ఎడిటర్ గా ఉద్ధవ్, వరుస హ్యాట్రిక్ లతో దూసుకుపోతున్నభీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

  ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగానే పలు ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్లు రావడం, ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషంగా వుంది. ఇప్పటికే చిత్ర మ్యూజిక్ రైట్స్ పెద్ద సంస్థ తీసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ఎ2 బి సంస్థ నిర్మాత రజిత్ రావు తెలిపారు.

  తారాగణం: విజె సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్, బిత్తిరి సత్తి ,షకలక శంకర్, పృద్వీ, డిజే టిల్లు మురళి, సూపర్ విమన్ లిరీషా, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, చమ్మక్ చంద్ర, విరాజ్ ముత్తంశెట్టి, గీతా సింగ్, రోహిణి, రూప లక్ష్మీ, మణి చందన, విక్రమ్ ఆదిత్య, రఘుబాబు, ఆనంద్ చక్రపాణ, గబ్బర్ సింగ్ బ్యాచ్

  సాంకేతిక విభాగం:
  రచన, దర్శకత్వం : డైమాండ్ రత్నబాబు
  నిర్మాత : రజిత్ రావు
  బ్యానర్ : ఎ2 బి ఇండియా ప్రొడక్షన్
  కోప్రోడ్యుసర్లు: షేక్ రఫీ, బిట్టు ( నర్సయ్య న్యవనంది ), రాము వురు గొండ
  సంగీతం: భీమ్స్ సిసిరోలియో
  డీవోపీ: వేణు మురళీధర్
  ఎడిటర్ : ఉద్ధవ్
  లిరిక్స్ : కాసర్ల శ్యామ్
  స్టంట్స్ : నందు
  కోరియోగ్రఫీ: భాను
  పీఆర్వో : వంశీ- శేఖర్.

  Share post:

  More like this
  Related

  Windows : విండోస్  లోసాంకేతిక లోపాలు.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన సేవలు

  Windows Windows : జూలై 19 ఉదయం నుంచి బ్యాంకులతో సహా మైక్రోసాఫ్ట్...

  Darling Movie : మూవీ రివ్యూ : డార్లింగ్ హిట్టా.. ఫట్టా..?

  డైరెక్షన్ : అశ్విన్ రామ్ నిర్మాత: నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి సినిమాటోగ్రఫి: నరేష్ ఎడిటర్: ప్రదీప్...

  Gautam Gambhir : గౌతమ్ గంభీర్ చెప్పినట్లే చేస్తున్నాడా?

  Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు...

  Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. పది జిల్లాలకు రెడ్ అలర్ట్

  Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం, శనివారం భారీ నుంచి...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Kerintha Actress Bhavana : కేరింత నటి భావన అయ్యా బాబోయ్ నువ్వేనా అసలు 

  Kerintha Actress Bhavana : దిల్ మూవీలో సినిమా పేరునే ఇంటి...

  Dil Raju : కూతురు సినిమాపై దిల్ రాజు మౌనం.. మరీ ఇంత వివక్ష ఎందుకు బాస్

  Dil Raju : తెలుగు లో ప్రస్తుతం దిల్ రాజు సక్సెస్...

  Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

  Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

  Pushpa 2 Teaser : ‘పుష్ప 2’ కొత్త పోస్టర్, టీజర్ విడుదల

  Pushpa 2 Teaser : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల...