నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సూపర్ డూపర్ హిట్ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ nbk సీజన్ 2. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో సీజన్ మొదలైంది. ఇక ఈ రెండో సీజన్ లో కూడా మహామహులు గెస్ట్ లుగా వస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షోకు రావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఆహా టీమ్ చాలా కష్టపడుతోంది.
ఈ షోకు ఎంతగా డిమాండ్ ఉందంటే ఏకంగా థియేటర్ లోనే స్పెషల్ షో వేసుకునేంత. అసలే బాలయ్య పై పవన్ కళ్యాణ్ గెస్ట్ దాంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో స్పెషల్ షోలు వేశారు. కొన్ని స్క్రీన్ లను ఏర్పాటు చేసి సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే చూడాలని ఫిక్స్ అయినవాళ్ళకు ఈ షో ఏర్పాటు చేశారు. షో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఆహా లో ఇప్పుడు అఫీషియల్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దాంతో ఎక్కడా క్రాష్ కాకుండా టెక్నికల్ టీమ్ ని అలెర్ట్ చేశారు ఆహా యాజమాన్యం.