
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి తనయుడు సింహా కోడూరి హీరోగా నటించిన తాజా చిత్రం ” ఉస్తాద్ “. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించడం విశేషం. సాయి కొర్రపాటి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ చిత్రానికి ఒక నిర్మాత కావడం విశేషం. కీరవాణి – వల్లి లకు ఇద్దరు కొడుకులు కాగా పెద్ద కొడుకు కాల భైరవ సంగీత దర్శకుడిగా అలాగే గాయకుడిగా కూడా రానిస్తున్నాడు.ఇక రెండో కొడుకు ఈ సింహా కోడూరి. బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించాడు కూడా.
ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రంలో చిన్న ఎన్టీఆర్ గా నటించింది ఈ సింహా కోడూరినే. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కానీ కమర్షియల్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఈ ఉస్తాద్ తో విజయం సాధించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా ఉస్తాద్ టీజర్ విడుదల చేసారు మేకర్స్. టీజర్ ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా హీరోలకు ఏదో ఒక ప్రాబ్లం ఉంటే అది తెరమీద బాగానే వర్కౌట్ అయ్యాయి. అలాంటి సినిమాల జాబితాలో ఉస్తాద్ కూడా చేరే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఇందులో కూడా హీరోకు ఒక ఫోబియా ఉంది. అది ఏంటి అన్నది టీజర్ లో రివీల్ చేశారు. ఫణి దీప్ అనే యువకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వేశవిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.






