
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహా రెడ్డి చిత్రం ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U / A సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఇక సెన్సార్ టాక్ ప్రకారం వీర సింహా రెడ్డి అదిరిపోయిందని అంటున్నారు. బాలయ్య మార్క్ డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ , అలాగే సెంటిమెంట్ తో పాటుగా పాటలు మొత్తానికి నందమూరి అభిమానులు అలాగే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అని అంటున్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 12 న విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలయ్య సరసన శృతి హాసన్ , హానీ రోజ్ నటించారు. ఇక కీలక పాత్రల్లో దునియా విజయ్ , వరలక్ష్మీ శరత్ కుమార్ , సప్తగిరి , అజయ్ ఘోష్ తదితరులు నటించారు. బాలయ్య రెండు విభిన్న గెటప్ లలో కనిపిస్తుండటం ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ముఖ్యంగా నడివయసు పాత్రలో మాత్రం బాలయ్య గెటప్ అదిరింది.
ఇప్పటికే టీజర్ , ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగగా సెన్సార్ కార్యక్రమాలతో వీరసింహా రెడ్డి చిత్రం పై మరిన్ని అంచనాలు పెరిగాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో ఇక రిలీజ్ కార్యక్రమమే తరువాయి. తెలుగు రాష్ట్రాల్లో జనవరి 12 న విడుదల అవుతుండగా ఓవర్ సీస్ లో మాత్రం జనవరి 11 నే విడుదల అవుతోంది. ఈ చిత్రానికి ఓవర్ సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ లభిస్తున్నాయి.






