నటసింహం నందమూరి బాలకృష్ణ ఊచకోత మొదలు పెట్టాడు. బాలయ్య వీరసింహారెడ్డి చిత్రం మొదటి రోజున 54 కోట్ల వసూళ్లను సాధించి ఊచకోత అంటే ఏంటో చూపించాడు. జనవరి 12 న బాలయ్య నటించిన వీరసింహారెడ్డి భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. బాలయ్యకు ఇటీవల కాలంలో ఎవరూ ఊహించని క్రేజ్ లభించడంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి.
ఇక మొదటి రోజున 54 కోట్ల వసూళ్లు అంటే మాటలు కాదు …….. పెను సంచలనం అనే చేప్పాలి. బాలయ్య సినిమా మొదటి రోజున 20 నుండి 30 కోట్లు సాధిస్తే గొప్ప కానీ వీరసింహారెడ్డి చిత్రం మాత్రం ఏకంగా అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 54 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇక బాలయ్య ఊచకోతకు సంక్రాంతి సెలవులు కూడా తోడవ్వడంతో మరో నాలుగు రోజుల పాటు భారీ వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే ఈ సినిమా అవలీలగా 120 కోట్ల నుండి 150 కోట్ల వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.