
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సంచలన చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12 న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాలయ్య చిత్రాల్లోనే నెంబర్ వన్ గా నిలిచింది.
థియేటర్ లలో వీరసింహారెడ్డి సందడి ముగిసింది దాంతో ఈ సినిమాను ఓటీటీ లోకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ మొత్తాన్ని ఇచ్చి సొంతం చేసుకుంది. వీరసింహారెడ్డి థియేటర్ల వద్ద సందడి తగ్గింది కాబట్టి ఫిబ్రవరి 21 న స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట.
బాలయ్య ద్విపాత్రాభినయం పోషించగా శృతి హాసన్ , హనీ రోజ్ లు బాలయ్య సరసన నటించారు. ఇక చంద్రిక రవి ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది. తమన్ అందించిన పాటలు , నేపథ్య సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.