నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ” వీర సింహా రెడ్డి ”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా కీలక పాత్రల్లో దునియా విజయ్ , వరలక్ష్మీ శరత్ కుమార్ లు నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుండి ” జై బాలయ్య ” అనే మాస్ సాంగ్ ని విడుదల చేసారు. నందమూరి అభిమానులను అలరించేలా ఈ పాటకు బాణీలు అందించాడు తమన్. అంతేకాదు ప్రమోషన్ సాంగ్ కూడా చిత్రీకరించారు జై బాలయ్య అంటూ. తాజాగా జై బాలయ్య అనే పాట విడుదల చేసారు. ఈ పాట అభిమానులను విశేషంగా అలరించేలా ఉంది. ఇక మాస్ కు అయితే పండగే అని చెప్పాలి.
వీర సింహా రెడ్డి చిత్రాన్ని 2023 జనవరి లో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య సినిమా అందునా రాయలసీమ ఫ్యాక్షన్ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అలాగే బాలయ్య గెటప్ కు కూడా అద్భుత స్పందన వచ్చింది. అఖండ చిత్రం తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం కావడంతో వీర సింహా రెడ్డి కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్లకు జై బాలయ్య సాంగ్ మరింత ఉత్సాహాన్ని నింపింది అనే చెప్పాలి. ఈ పాట చిత్రీకరణ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశారట.