నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహా రెడ్డి చిత్రం మేకింగ్ వీడియో కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు మేకర్స్. ఈ వీడియో అభిమానులను విశేషంగా అలరించేలా ఉంది. బాలయ్య మాస్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. బాలయ్య రెండు విభిన్న గెటప్ లలో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
వీర సింహా రెడ్డి చిత్రాన్ని 2023 జనవరి 12 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన మూడు పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. బాలయ్య సరసన హానీ రోజ్ , శృతి హాసన్ లు నటిస్తున్నారు. ఇక ముఖ్య పాత్రల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ , దునియా విజయ్ నటిస్తున్నారు.