నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం ” వీర సింహా రెడ్డి ”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో 20 శాతం షూటింగ్ మిగిలి ఉంది. దాన్ని కూడా పూర్తి చేసి 2023 సంక్రాంతి బరిలో వీర సింహా రెడ్డిని దింపాలని చూస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటించారు కూడా.
కత్తి దూసిన బాలయ్య స్టిల్ వదిలి ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేసారు. ఆ తర్వాత బాలయ్య చేత పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పించిన టీజర్ ని వదిలి దుమ్ము రేపారు. దాంతో బిజినెస్ సర్కిల్లో ఈ చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇంకేముంది పెద్ద ఎత్తున బయ్యర్లు పోటీ పడటంతో ఏకంగా 83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
కేవలం థియేట్రికల్ బిజినెస్ 83 కోట్లకు అమ్ముడుపోవడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో 100 కోట్ల బిజినెస్ జరగడం ఖాయమని తెలుస్తోంది. ఇది బాలయ్య సాధించిన రికార్డ్ అనే చెప్పాలి. బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ , దునియా విజయ్ తదితరులు నటిస్తున్నారు.