నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం వీరసింహారెడ్డి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 2023 జనవరి 12 న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. భారీ ఓపెనింగ్స్ సాధించి బాలయ్య చిత్రాల్లోనే నెంబర్ వన్ గా నిలిచింది వీరసింహారెడ్డి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 145 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది.
ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ వచ్చేసింది. ఇంతకీ వీరసింహారెడ్డి ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో తెలుసా…… ఫిబ్రవరి 23 న. మరి ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుందో తెలుసా….. desney plas hotstar లో . బాలయ్య వీరసింహారెడ్డి చిత్రాన్ని భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుంది ఈ సంస్థ. ఇంతకుముందు బాలయ్య అఖండ చిత్రాన్ని కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అది కూడా బ్లాక్ బస్టరే దాంతో ఈ సినిమాను కూడా సొంతం చేసుకుంది.
బాలయ్య వీరసింహారెడ్డి గా నటవిశ్వరూపం చూపించిన విషయం తెలిసిందే. బాలయ్య గెటప్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. బాలయ్య ద్విపాత్రాభినయం పోషించగా అందాల భామలు శృతి హాసన్, హనీ రోజ్ లు నాయికలుగా నటించారు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్య చెల్లిగా అద్భుతమైన పాత్ర పోషించింది. కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా నటించాడు. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసారు బాలయ్య అభిమానులు. థియేటర్ లలో చూడని వాళ్లకు ఈనెల 23 న మరోసారి పండగ వచ్చినట్లే.