
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ” వీరసింహా రెడ్డి”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2023 జనవరి 12 న భారీ ఎత్తున విడుదలై ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలయ్య ద్విపాత్రాభినయం పోషించగా శృతి హాసన్ , హానీ రోజ్ బాలయ్య సరసన నటించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ , దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు.
వీరసింహారెడ్డి ఓవరాల్ గా 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. బాలయ్య నటజీవితంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా వీరసింహారెడ్డి చిత్రం నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ చిత్రం ఇక రేపటి నుండి ఓటీటీలోకి రానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈనెల 23 నుండి స్ట్రీమింగ్ కి రానుంది. దాంతో బాలయ్య ఓ వీడియో రిలీజ్ చేసాడు. వీరసింహారెడ్డి చిత్రాన్ని తప్పకుండా చూడండి అంటూ వీడియో విడుదల చేసాడు.
గతంలో అఖండ చిత్రాన్ని కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుంది. అఖండ చిత్రం కూడా బాక్సాఫీస్ ను దున్నేసింది. అలాగే ఓటీటీ లో కూడా దుమ్ము రేపింది. ఇక ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుందని ధీమాగా ఉన్నారు వీరసింహారెడ్డి బృందం. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ అలాగే పాటలు ఈ సినిమాను బ్లాక్ బస్టర్ ని చేసాయి.