జనవరి 6 న ఒంగోలులో వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరుగనుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్ర దర్శకుడు అనే విషయం తెలిసిందే. గోపీచంద్ జిల్లా ఒంగోలు దాంతో ఒంగోలులో భారీ ఎత్తున ఈ వేడుక చేయడానికి రంగం సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహా రెడ్డి చిత్రం జనవరి 12 న విడుదల అవుతుండటంతో జనవరి 6 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు ప్రజల మధ్యన జరుగనుంది.
ఇక ఇదే రోజున ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ వేడుకకు పెద్ద ఎత్తున నందమూరి అభిమానులను ఆహ్వానిస్తున్నారు. అలాగే అభిమానులు కూడా ఈ వేడుక కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వీర సింహా రెడ్డి చిత్రంలోని పాటలు బ్లాక్ బస్టర్ కావడంతో అలాగే టీజర్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలు లోని ABM కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్నారు.