
నటసింహం నందమూరి బాలకృష్ణ బావ నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వీరసింహారెడ్డి చిత్రాన్ని చూస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి లో నందమూరి – నారా కుటుంబ సభ్యులు అందరూ వీరసింహారెడ్డి చిత్రాన్ని చూడనున్నారు. ఇందుకోసం మొత్తం హాల్ బుక్ చేశారు. సంక్రాంతి పండుగకు నారా కుటుంబ సభ్యులు అందరూ నారావారిపల్లె కు వెళ్లడం గతకొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక బాలయ్య – చంద్రబాబు వియ్యంకులు అయ్యాక ప్రతీ ఏడాది కూడా నారా వారి పల్లె కు వెళ్తున్నారు. ఇక ఈ ఏడాది కూడా నారావారి పల్లె కు చేరుకున్నారు.
బాలయ్య రాకతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాలయ్య ను చూడటానికి పోటీ పడ్డారు. ఇక బాలయ్య కూడా అభిమానులకు అభివాదం చేస్తూ జోష్ నింపాడు. బాలయ్య వచ్చాడన్న విషయం తెలుసుకున్న నటుడు మంచు మోహన్ బాబు , మంచు విష్ణు బాలయ్య ను కలిశారు. అంతేకాదు భోగి మంటలు వేసి చిందులు వేశారు.