
వీర సింహా రెడ్డి ట్రైలర్ వచ్చింది. ఇక ఈ ట్రైలర్ గురించి ఎంత చెప్పినా తక్కువే…… అవును వీర సింహా రెడ్డి ట్రైలర్ దద్దరిల్లి పోయింది. ఇక ఇదే రేంజ్ లో సినిమా ఉంటే కనుక బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయం. పనిలో పనిగా ఈ సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సెటైర్లు కూడా వేసాడు బాలయ్య. ఆ డైలాగ్స్ థియేటర్లలో బాక్స్ లు బద్దలు కొట్టడం ఖాయం.
నిజంగానే బాలయ్య అభిమానులకు, మాస్ సినిమాలను కోరుకునే వాళ్లకు వీర సింహా రెడ్డి పిచ్చ పిచ్చగా నచ్చడం ఖాయం. నిజంగా అలా ఉంది మరి ట్రైలర్. ఇక సినిమా కూడా బాగున్నట్లు ఇప్పటికే రిపోర్ట్ ఉండగా ట్రైలర్ చూసిన అభిమానులు సంక్రాంతి కి బాక్సాఫీస్ ను దున్నేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య గెటప్ అద్భుతంగా ఉంది. రెండు విభిన్న గెటప్ లు బాలయ్య అభిమానులను అలరిస్తున్నాయి. ఇక బాలయ్య చెప్పిన డైలాగ్స్ డైనమైట్ లా పేలుతున్నాయి. ఒంగోలు లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా దర్శకుడు బి. గోపాల్ ఈ ట్రైలర్ ను విడుదల చేసారు.






