విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప ఆల్రెడీ OTT లో విడుదల అయ్యింది కదా ….. మళ్లీ థియేటర్ లలో విడుదల కావడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇక్కడే ఉంది ట్విస్ట్ …….. డిసెంబర్ 13 న వెంకీ మామ పుట్టినరోజు దాంతో ఆ సందర్భంగా నారప్ప చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఒక్క రోజు మాత్రమే సుమా !
డిసెంబర్ 13 న వెంకటేష్ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు ఏపీ , తెలంగాణ లలో నారప్ప విడుదల చేస్తున్నారు. తమిళంలో సంచలన విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో నారప్ప గా రీమేక్ చేశారు. ఈ చిత్రం నేరుగా OTT లోనే విడుదల అయ్యింది. OTT లో మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రానికి. దాంతో థియేటర్ లలో కూడా తప్పకుండా మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆయా హీరోల చిత్రాలను మళ్లీ మళ్లీ విడుదల చేస్తున్నారు. వాటికి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఆ కోవలోనే వెంకీ మామ నారప్ప వస్తోంది.