నెట్ ఫ్లిక్స్ కు హీరో వెంకటేష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకటేష్ ఏంటి ? నెట్ ఫ్లిక్స్ కు సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఈ వీడియో చూడండి ….. మీకే అర్థమవుతుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…… రానా నాయుడు అనే వెబ్ సిరీస్ పేరు నాగా నాయుడు గా మార్చాలని డిమాండ్ చేస్తున్నాడు వెంకీ.
హీరో ఎవరు ? నేను …… తప్పు చేయకు నెట్ ఫ్లిక్స్ …… అందంగా కనిపించేది ఎవరు ? నేను ……. స్టార్ ఎవరు ? అది కూడా నేనే…… ఫ్యాన్స్ ఉన్నది ఎవరికి ……నాకే ….. అప్పుడు టైటిల్ ఎవరి పేరు మీద ఉండాలి…… నా పేరు మీదే ఉండాలి కదా ….. అంటూ నెట్ ఫ్లిక్స్ కు వార్నింగ్ ఇస్తున్నాడు వెంకీ.
ఈ వీడియో ప్రమోషన్ కోసం , సరదా కోసం ….. అలాగే ఈ వెబ్ సిరీస్ జనాల్లోకి వెళ్లడం కోసం చేసింది. వెంకీ కామెడీ టైమింగ్ అదిరిపోతుందనే విషయం అందరికీ తెలిసిందే. యాక్షన్ తో కూడిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇందులో వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వస్తోంది. దాంతో ఇలా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు.
Tera naam bhi meine rakha, show ka naam bhi mein rakhega.#RanaNaidu ki aisi ki taisi. @RanaDaggubati @NetflixIndia pic.twitter.com/R3GYlwZsEl
— Venkatesh Daggubati (@VenkyMama) February 13, 2023