
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ” SAINDHAV ”. హిట్ వంటి సిరీస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే అప్పుడే రిలీజ్ డేట్ లాక్ చేసి పడేసారు. ఇంతకీ ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా …….. డిసెంబర్ 22 , 2023.
అవును ఈ ఏడాది ఆఖరున వెంకీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. వెంకటేష్ గతకొంత కాలంగా రేసులో లేకుండాపోయాడు. నారప్ప , దృశ్యం 2 చిత్రాలను నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసాడు. దాంతో వెంకీ మామను థియేటర్ లలో చూడలేకపోయారు. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా ! చిత్రంలో దేవుడిగా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు ….. పైగా చాలామందికి తెలియదు కూడా. దాంతో ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు వెంకీ అభిమానులు.






