
తెలుగు ప్రజల గుండెల్లో అన్నగా చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి , సమ్మోహన శక్తి నందమూరి తారకరామారావు. నిమ్మకూరు కుర్రోడు చెన్నపట్నం ( చెన్నై ) లో అడుగుపెట్టి తిరుగులేని , చెరిగిపోని చరిత్ర సృష్టించారు. సినిమారంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి రాజకీయ రంగంలో కూడా సరికొత్త చరిత్ర సృష్టించారు. సినిమారంగంలో అలాగే రాజకీయ రంగంలో రారాజుగా వెలుగొందిన నందమూరి తారకరామారావు ఈ స్థాయిని అందుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా……. సినిమాల్లోకి రాకముందు నిమ్మకూరు నుండి విజయవాడకు సైకిల్ మీద వచ్చి పాలు పోసేవాడు.

విజయవాడలో బాబాయ్ హోటల్ చాలా ఫేమస్ అనే విషయం తెలిసిందే. బాబాయ్ హోటల్ పేరు ఎంతగా మారుమ్రోగిందంటే …….. ఆ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిందంటే అతిశయోక్తి కాదు సుమా ! అలా బాబాయ్ హోటల్ కు కూడా పాలు పోసాడు ఎన్టీఆర్. తెల్లవారు జామునే లేచి సైకిల్ మీద ఇంటింటికీ వెళ్లి పాలు పోస్తూ , పాలు పోయడం అయ్యాక రెడీ అయి మళ్లీ కాలేజ్ కు వెళ్ళేవాడు. ఇలా ఎన్నో కష్టాలు పడి ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరాగ్ర కథానాయకుడిగా ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా చెరగని ముద్ర వేశారు. అయితే 1943 సంవత్సరంలో ఎన్టీఆర్ సైకిల్ మీద పాలు పోయాడనికి వెళ్లిన సమయంలో తీసుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ రేర్ ఫోటో ఎన్టీఆర్ అభిమానులను విశేషాంగా అలరిస్తోంది. మీరూ ఓ లుక్కేయండి ఈ ఫోటోపై .మరో విశేషం ఏమంటే……. ఒకప్పుడు ఏ సైకిల్ మీద నైతే తిరిగి పాలు అమ్మాడో అదే సైకిల్ ను తన పార్టీ గుర్తుగా పెట్టుకొని అఖండ విజయం సాధించడం.