రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం ” ఖుషి ”. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గత ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉండే. కానీ ఒకవైపు సమంత అనారోగ్యంతో బాధపడటంతో కొన్నాళ్ళు షూటింగ్ కు విరామం ఇచ్చారు. ఇక అదే సమయంలో విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో భారీ పరాజయం మూటగట్టుకోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దాంతో ఈ రౌడీ హీరో కూడా కొన్నాళ్ళు షూటింగ్ కు విరామం ఇచ్చాడు.
కట్ చేస్తే ……. వచ్చే నెల మార్చిలో ఖుషి సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సమంత – విజయ్ దేవరకొండ ల మధ్య రొమాంటిక్ సాంగ్స్ రెండు నార్వేలో షూట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. ఈ రెండు పాటలు కూడా యూత్ ని అలరించేలా ఉంటాయని భావిస్తున్నారు. నార్వేలోని అందమైన లొకేషన్ లలో ఈ రెండు పాటలను చిత్రీకరించనున్నారట.
ఇంతకుముందు సమంత – విజయ్ దేవరకొండ ల కాంబినేషన్ లో మహానటి వచ్చింది. అయితే ఆ సమయానికి విజయ్ దేవరకొండ పెద్ద హీరో కాదు. పైగా మహానటి చిత్రంలో మెయిన్ పాత్ర కీర్తి సురేష్ ది. సమంత – విజయ్ దేవరకొండ రెండు పాత్రలు కూడా సపోర్ట్ క్యారెక్టర్స్ అనే చెప్పాలి. కానీ ఈ సినిమాలో మాత్రం మెయిన్ పిల్లర్స్. ఇక టైటిల్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రం ” ఖుషి ” కావడంతో కాస్త రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువే అనే చెప్పాలి.