లైగర్ చిత్రం కోసం ఇంతగా కష్టపడుతున్నారు కదా ! మరి ఈ సినిమా ప్లాప్ అయితే ? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండను. సాధారణంగా ఈ ప్రశ్న నా కెరీర్ తొలినాళ్ళలో అయితే వైల్డ్ గా రియాక్ట్ అయ్యేవాడ్ని కానీ ఇప్పుడు అభిమానులు నామీద చూపిస్తున్న అభిమానానికి ఫిదా అయిపోయాను. దాంతో కోపం రావడం లేదు. వాళ్ళ కోసం ఎంతటి కష్టమైనా సరే పడాల్సి అనిపిస్తోంది అందుకే ఈ ప్రశ్నకు కోపం రావడం లేదు అంటూ కూల్ గా సమాధానం ఇచ్చి షాక్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ చిత్రం ఈనెల 25 న భారీ ఎత్తున విడుదల అవుతోంది. ఛార్మి – కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించగా అతడి ప్రేయసిగా బాలీవుడ్ భామ అనన్య పాండే తల్లి పాత్రలో ఒకప్పటి గ్లామర్ తార రమ్యకృష్ణ నటించగా ఇక కీలక పాత్రలో మైక్ టైసన్ నటించాడు.
విజయ్ దేవరకొండ చాలా ఎగ్రెసివ్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. దాంతో సదరు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఎలా రియాక్ట్ అవుతాడో అని అనుకున్నారు. కానీ చాలా కూల్ గా సమాధానం ఇవ్వడంతో రౌడీ అభిమానులు మరింత సంతోషంగా ఉన్నారు. అంతేకాదు లైగర్ ని పెద్ద హిట్ చేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇక మరికొద్ది గంటల్లోనే లైగర్ ఫలితం ఏంటి ? అన్నది తేలనుంది.
Breaking News