బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది ప్రస్తుతం. నిన్నమొన్నటి వరకు అమీర్ ఖాన్ , అక్షయ్ కుమార్ ల చిత్రాలు విడుదల కావడంతో ఆ చిత్రాలను బాయ్ కాట్ చేయాలనే ట్రెండ్ నడిచింది. అది కాస్త వైరల్ గా మారి ఆ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. కట్ చేస్తే దమ్ముంటే మా సినిమా కూడా బాయ్ కాట్ చేయండి అని సవాల్ విసిరారు తాప్సీ , అనురాగ్ కశ్యప్ . కట్ చేస్తే అదే సీన్ జరిగింది. తాప్సీ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.
ఇక ఇపుడేమో బాయ్ కాట్ ట్రెండ్ ని వైరల్ చేసే వాళ్ళ దృష్టి రౌడీ హీరో విజయ్ దేవరకొండ మీద పడింది. తాజాగా ఈ హీరో నటిస్తున్న చిత్రం ” లైగర్ ”. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఛార్మి – కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. ఇపుడు ఈ సినిమాకు ఇదే సమస్య తలెత్తింది. కరణ్ జోహార్ నెపోటిజం మీద ఆగ్రహంగా ఉన్న సోషల్ మీడియా వీరులు లైగర్ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.
దాంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు మండింది. నా సినిమాని కూడా బాయ్ కాట్ చేస్తారా ? చూసుకుందాంరా అంటూ సవాల్ విసిరాడు. ఈ సవాల్ తో మరింతగా కష్టాలు వచ్చి పడేలా ఉన్నాయి. ఎందుకంటే మరింతగా ఫోకస్ అయ్యింది మిగతా వాళ్ళ దృష్టి. దాంతో మరింతగా వైరల్ అయ్యేలా చేస్తున్నారు బాయ్ కాట్ అంశాన్ని.
లైగర్ చిత్రం ఈనెల25 న భారీ ఎత్తున విడుదల అవుతోంది. విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించగా అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. మైక్ టైసన్ కీలక పాత్రలో నటించాడు. ఇక రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ తల్లిగా నటించింది. బాయ్ కాట్ అంశాన్ని లేవనెత్తుతున్న వాళ్ళు గెలుస్తారా ? వాళ్ళని ఎదిరించిన విజయ్ దేవరకొండ గెలుస్తాడా ? అన్నది ఈనెల 25 న తేలనుంది.
Breaking News