రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఛార్మి , పూరీ జగన్నాథ్ , విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా చిత్రం కావడంతో భారీ బడ్జెట్ అయ్యింది. బిజినెస్ కూడా బాగానే జరిగింది కానీ కనీసం 20 కోట్ల షేర్ కూడా రాకపోవడంతో 100 కోట్ల నష్టం జరిగింది. దాంతో బయ్యర్లు దారుణంగా నష్టపోయారు.
లైగర్ భారీ నష్టాలను చవిచూడటంతో తర్వాత చేయాలనుకున్న ” జనగణమన ” చిత్రాన్ని ఆపేసినట్లు తెలుస్తోంది. లైగర్ చిత్రం పూర్తి కాకుండానే ” జనగణమన ” చిత్రాన్ని భారీగా ప్రారంభించాడు పూరీ జగన్నాథ్. ఈ చిత్రానికి కూడా హీరో విజయ్ దేవరకొండ అలాగే నిర్మాత ఛార్మి. అయితే లైగర్ కోలుకోలేని దెబ్బ కొట్టడంతో జనగణమన చిత్రాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా చేయడమే కష్టం అనుకుంటే జనగణమన లాంటి భారీ ప్రాజెక్ట్ ను చేయడం చాలా చాలా కష్టం . ఒకవేళ ధైర్యం చేసి తీయాలంటే డబ్బులు కావాలి. ఇప్పట్లో ఫైనాన్షియర్లు ఎవరు కూడా ముందుకు వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు దాంతో జనగణమన చిత్రాన్ని మూలకు పడేసినట్లే అని అంటున్నారు. ఇక లైగర్ షాక్ నుండి కోలుకున్న విజయ్ దేవరకొండ ఖుషి చిత్రంపై ఫోకస్ పెట్టాడు.
Breaking News