రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఛార్మి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పూరీ జగన్నాథ్ కు అలాగే విజయ్ దేవరకొండకు కూడా ఇది మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. విజయ్ దేవరకొండ తల్లిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించగా విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటించింది. ఇక కీలక పాత్రలో బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ నటించాడు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైన లైగర్ చిత్రానికి మిశ్రమ స్పందన కనిపిస్తోంది సోషల్ మీడియాలో. ఆగస్ట్ 25 న అంటే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రానికి ఓవర్సీస్ లో అప్పుడే షోలు పడ్డాయి. దాంతో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్ రివ్యూ ప్రకారం లైగర్ కు మిశ్రమ స్పందన కనబడుతోంది. కొంతమంది చాలా బాగుందని అంటుంటే మిగతవాళ్ళు మాత్రం బాగోలేదని ట్వీట్ చేస్తున్నారు. ఓవరాల్ గా లైగర్ కు ట్విట్టర్ లో మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ అసలైన తీర్పు తెలుగు ప్రేక్షకులు కొద్ది గంటల్లోనే ఇవ్వనున్నారు.