రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉదయ్ కిరణ్ కు పట్టిన గతే పడుతుందని వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రముఖ హీరోల గురించి అలాగే హీరోయిన్ ల గురించి రాజకీయ నాయకుల గురించి జ్యోతిష్యం చెబుతుంటాడు వేణు స్వామి. అందులో భాగంగానే పలువురు భవిష్యత్ గురించి చెప్పి సంచలనం సృష్టించాడు.
కట్ చేస్తే తాజాగా విజయ్ దేవరకొండ గురించి వేణు స్వామి చెప్పిన డైలాగ్స్ సంచలనంగా మారాయి. ఎందుకంటే విజయ్ దేవరకొండకు ఉదయ్ కిరణ్ కు పట్టిన గతే పడుతుందని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉదయ్ కిరణ్ కు పట్టిన గతే అంటే ఎలాంటిది ….. కెరీర్ నాశనం అవుతుందా ? లేక జీవితమే నాశనం అవుతుందా ? అంటూ ఆవేదన చెందుతున్నారు కొంతమంది రౌడీ ఫ్యాన్స్.
ఉదయ్ కిరణ్ కు అప్పట్లో విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్ , మహేష్ బాబు లాంటి టాప్ స్టార్స్ కు లేని క్రేజ్ అప్పట్లో ఉదయ్ కిరణ్ కు ఉండేది. కానీ అనూహ్యంగా ఉదయ్ కిరణ్ పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులు అయ్యింది. కెరీర్ నాశనం కావడమే కాకుండా మనిషే లేకుండాపోయాడు. దాంతో మా హీరోకు ఉదయ్ కిరణ్ పరిస్థితి తలెత్తడం ఏంటి ? అని బాధపడుతున్నారు. అయితే వేణు స్వామి చెప్పిన దాని ప్రకారం విజయ్ దేవరకొండకు విపరీతమైన క్రేజ్ వస్తుంది ఆ తర్వాత కెరీర్ లేకుండా పోతుందని అంటున్నాడు.
Breaking News