విజయ్ దేవరకొండ తనని తిట్టిన వ్యక్తిని కలిసి సారీ చెప్పాడు. ఈ సంచలన సంఘటన ముంబైలో జరిగింది. సాధారణంగా ఈ రౌడీ హీరోకు కోపం ఎక్కువ దాంతో తనని చిన్న మాట అన్నా సరే ఊరుకునే రకం కాదు……. కానీ ఇప్పుడు మనిషి పూర్తిగా మారిపోయాడట. దాంతో తనని తిట్టినవాళ్లను తిట్టకుండా వాళ్ళ కోపాన్ని అర్ధం చేసుకుంటున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే …….. మనోజ్ దేశాయ్ అనే ముంబై లోని ఓ థియేటర్ ఓనర్ లైగర్ చిత్రాన్ని విడుదల చేసాడు తన థియేటర్ లో. లైగర్ పై ఒకవైపు భారీ అంచనాలు ఉండేవి దాంతో పాటుగా బాయ్ కాట్ లైగర్ అనేది కూడా బాగా వైరల్ అయ్యింది. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న విజయ్ దేవరకొండ బాయ్ కాట్ చేస్తారా ? చేయాండ్రా ? చూసుకుందాం అంటూ వాళ్ళని మరింతగా రెచ్చగొట్టాడు.
అది థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయ్ కు కోపం వచ్చేలా చేసింది. దాంతో విజయ్ దేవరకొండ పై తిట్ల వర్షం కురిపించాడు. నీమాటల వల్లే కలెక్షన్లు మరింత దారుణంగా పడిపోయాయి అంటూ ఆవేదన చెందాడు. ఈ మాటలు బాగా వైరల్ అయ్యాయి. అలాగే విజయ్ దేవరకొండ చెవిన కూడా పడ్డాయి. దాంతో దుబాయ్ వెళ్లే ముందు ముంబై లోని మనోజ్ దేశాయ్ థియేటర్ కు వెళ్లి ఆయనకు సారీ చెప్పాడు విజయ్ దేవరకొండ. తన దగ్గరకు వచ్చి సారీ చెప్పడంతో ఆ పెద్దాయన ఫిదా అయిపోయాడు. అదీ విషయం.