రౌడీ హీరో విజయ్ దేవరకొండ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు. విజయ్ మీద మహేష్ అభిమానులకు కోపం ఎందుకో తెలుసా……… మహేష్ బాబు చేయాల్సిన జనగణమన చిత్రాన్ని చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. జనగణమన చిత్రాన్ని నేను చేసి చూపిస్తా చూడు……. మహేష్ సర్ చేయలేనిది అనే అర్థం వచ్చేలా మాట్లాడటమే మహేష్ అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యింది.
అయితే విజయ్ దేవరకొండ కు మహేష్ బాబు అంటే ఎనలేని గౌరవం. మహేష్ సర్ అని సంభోదిస్తుంటాడు విజయ్ దేవరకొండ. అలాంటిది విజయ్ మీద మహేష్ అభిమానులకు కోపం రావడానికి కారణం సోషల్ మీడియాలో తన మాటలు వేరే అర్థం వచ్చేలా వైరల్ అవడమే కారణం.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆగస్ట్ 25 న లైగర్ విడుదల అవుతోంది. ఇక మహేష్ బాబు తో చేయాలని అనుకున్న పూరీ జగన్నాథ్ మహేష్ కు కథ చెప్పాడు కానీ మహేష్ మాత్రం ఆ సినిమాకు ఒప్పుకోలేదు. దాంతో మహేష్ చుట్టూ తిరిగి తిరిగి సహనం కోల్పోయిన పూరీ అదే కథతో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన అనే చిత్రాన్ని ప్రారంభించాడు. అదే వివాదానికి కారణం అయ్యింది.